సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 ఏళ్లుగా వరుసగా ఇరుగుపొరుగు దేశాలతో, ఇస్లామిక్ తీవ్రవాద ముఠాలతో అలుపు సొలుపు లేకుండా యుద్దాలు చేసి విజయోత్సవాల తో అలసిపోయిన చిన్న దేశం ఇజ్రాయిల్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్భలంతో తనకన్నా వైశ్యలంలో 70 రేట్లు పెద్దదయిన ఇరాన్ ఫై బాంబులు వర్షం కురిపించి, పలు అణు స్థావరాలను ద్వంసం చేసి శాస్త్రవేత్తలను చంపి మరో యుద్ధం ప్రారంభించింది. తీరా చుస్తే ఇరాన్ ఎదురుదాడులతో ఇప్పుడు ఇజ్రాయిల్ ను వదిలి పెట్టడం లేదు.. ప్రపంచం గొప్పగా చెప్పుకొనే ఇజ్రాయిల్ అత్యంత అధునాత రక్షణ కవచం ఐరన్ డ్రోన్ ను బ్రద్దలు కొట్టి మరి ఆధునిక క్షిపణి దాడులతో ఆస్తులను ధ్వసం చెయ్యడం తో ప్రపంచం నివ్వెరపోయింది.. ఆఖరికి గూఢచారి ముసాద్ కార్యాలయం, అమెరికా రాయబార కార్యాలయాలపై కూడా మిసైల్ దాడులు చెయ్యడంతో ఇరాన్ తగ్గేదే లే అంటుంది. తాజగా నేడు, గురువారం ఇజ్రాయిల్ లోని ఆసుపత్రులపై, ప్రజల నివాసాలపై కూడా ఇరాన్ దాడులు చేసిందని సమాచారం. ప్రాణ నష్టం వివరాలు పూర్తిగా బయటకు రావడం లేదు. ఇక ఇజ్రాయిల్ అమెరికాను ఇరాక్ ఫై దాడికి దిగాలని సాయం కోరింది. చైనా రహస్యంగా ఇరాన్ కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. మరో ప్రక్క తాజగా రష్యా అడ్జక్షుడు పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. ఇరాన్ ఫై అమెరికా ప్రత్యక్ష దాడికి దిగితేపరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మరి ట్రంప్ ఇజ్రాయిల్ పక్షాన అమెరికా ను ఇక ప్రత్యక్ష యుద్ధ రంగంలోకి దించుతారా ? అమెరికా తన వ్యాపార ధోరణీ చూసుకొంటారా? వేచి చూడాలి.
