సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టాఫ్ సెలక్షన్ CGL 2025: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ఈసారి SSC CGL 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14,582 పోస్టులను భర్తీ చేయనున్నారు.SSC CGL 2025 టైర్ I పరీక్ష ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30, 2025 మధ్య నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థలు, ట్రిబ్యునళ్లలోని వివిధ గ్రూప్ లలో ఖాళీలను భర్తీ చేస్తారు.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష 2025 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 04 జూలై 2025.. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి గణితంలో కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II పోస్టులకు, డిగ్రీ కోర్సులోని అన్ని భాగాలు లేదా సెమిస్టర్‌లలో స్టాటిస్టిక్స్‌ సబ్జెక్ట్ కల్గి ఉండాలి.SSC CGL 2025 జీతాలు: గ్రేడ్ 4 వారికి నెలకు రూ.25,500 నుంచి రూ. 81,100 వరకు, గ్రేడ్ 5 వారికి నెలకు రూ. 29,200 నుంచి రూ. 92,300 వరకు, గ్రేడ్ 6 వారికి నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400 వరకు, గ్రేడ్ 7 వారికి నెలకు రూ.44,900 నుంచి రూ. 1,42,400 వరకు, గ్రేడ్ 8 వారికి నెలకు రూ.47,600 నుంచి రూ. 1,51,100 వరకు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *