సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం జగన్( ys jagan) ఎక్కడ పర్యటించిన వేలాదిగా అభిమానులు తరలి రావడం వాటి వీడియోలు సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో జరిగే ప్రమాదాల నేపథ్యంలో 100 మంది మించి రాకూడదని పోలీసులు హెచ్చరించినప్పటికీ విశేషంగా జనం తరలి రావడంతో పల్నాడు జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించిన కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1గా కారు డ్రైవర్ రమణారెడ్డిని,ఇప్పుడు నేటి ఆదివారం తాజగా A2గా వైఎస్ జగన్‌ను, A3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు? అని వార్తలు హల్ చేస్తున్నాయి. యాక్సిడెంట్లో సింగయ్య చనిపోయిన రోజు ఐపీఎస్‌లోని 304ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే పోలీస్ కెమెరా విజువల్స్‌లో పరిశీలించగా అది జగన్ ప్రయాణిస్తున్న కారు అని తేలిందని నేడు, ఆదివారం తాజగా పోలీసులు వైసీపీ అధినేత జగన్ ఫై కేసు నమోదు చేస్తారని ఆ వార్తల సారాంశం..
