సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి నేడు మంగళవారం తాజగా ముగిసిన ఇరాన్ ఇజ్రాయెల్ , అమెరికా యుద్ధం కేవలం 12 రోజులలో అందరికి ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ఎక్కుపెట్టడంతో ఈ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎంతో జన నష్టం శాస్త్రవేత్తల మరణాలు జరిగాయి. ఇరాన్ ఫై దాడులు జరుగుతున్నా సమయంలో తాను డబ్బు, నిధులు ఇచ్చి పలు దేశాలలో పోషిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదులు కానీ తన సరిహద్దు లో ఉన్న సాటి ముస్లీమ్ దేశాలు కానీ, ఆఖరికి తనకు అణుబాంబు ఇస్తానని హామీ ఇచ్చిన పాకిస్తాన్ కూడా తన కోసం ముందుకు రాకపోవడం ఇరాన్ కు గొప్ప గుణపాఠం. ఇంకా భారత్ , రష్యా, చైనా వెనుక నుండి అమెరికా దూకుడు ఆపడానికి యుద్ధం ఆపడానికి దౌచ్యం నిర్వహించాయి. ఇక వరుస యుద్ధాలతో ఇజ్రాయెల్ విజయగర్వముతో అదే ఊపుతో తప్పడు లెక్కతో తక్కువ అంచనాతో ఇరాన్ మీద దాడి కి దిగింది. అయితే పెద్ద షాక్.. కోటి మంది జనాభా కూడా లేని అతి చిన్న దేశం ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉండే ఐరన్ డ్రోన్ ను బ్రద్దలు కొట్టుకొని ఇరాన్ నుండి అనేక ఆధునిక మిస్సైల్ వచ్చి మీద పడటంతో .. ఆధునిక సాంకేతిక కు ప్రపంచ ఐకాన్ ఇజ్రాయిల్ తన బలహీనత బయట పడటంతో విస్తుపోయింది. ఇలాగే మరి కొద్దీ రోజులు ఇరాన్ మిస్సైల్స్ దాడి కొనసాగి ఉండి ఉంటె..ఇజ్రాయిల్ పరిస్థితి ఊహించడం కష్టం. దీనితో ఇప్పటివరకు ఇజ్రాయిల్ వెనుక ఉన్న అమెరికా (అడ్జక్షుడు ట్రంప్ )బయటకు వచ్చి నేరుగా ఇరాన్ ఫై దాడులకు దిగడంతో ఈ వివాదం మరింత రాజుకొంది. అమెరికా బాంబర్‌లు ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేశాయి. అయితే ఇరాన్ అణు స్థావరాలలో యురేనియం సాంకేతికత సామాగ్రి ను పలు ట్రక్కు లలో ముందే తరలించింది అని సాటిలైట్ ఉపగ్రహాలు గుర్తించడం గమనార్హం, రష్యా చైనాలు అమెరికా ను హెచ్చరించాయి. అమెరికాలో కూడా ప్రజలు రోడ్డులు ఎక్కి ట్రంప్ యుద్ధాల దూకుడు ను నిరసించారు. లేపి తన్నించుకోవడం అంటే.. అందరిని భయపెట్టేసాను అనుకునే ‘ట్రంప్’ ను ఇరాన్ తన తీవ్ర హెచ్చరికలతో కలవరానికి గురిచేసింది. గల్ఫ్ లోని 5 అమెరికా సైనిక స్థావరాలఫై ఇజ్రాయిల్ ఫై ఇరాన్ దాడులకు దిగింది. వెంటనే ట్రంప్ ప్యూహాత్మకంగా రష్యా చైనా కతార్ దేశాలతో ఇరాన్ కు సందేశాలు పంపాడు.. ఇక అందరం యుద్ధం ఆపేశామని ప్రకటించాడు. ఇందులో గెలిచిందెవరు? నిజానికి అందరు ఓడారు..వందలాది అమాయక ప్రజలను తమ ఇగోలతో పొట్టన పెట్టుకొన్నారు. అన్ని దేశాలను ఉచ్చులోకి లాగాలని చూసారు.ఆర్ధిక సంక్షోభాలలోకి నెట్టారు. అయితే కేవలం 12 రోజులలో గౌరవంగా యుద్ధం ముగించారు. ఉక్రెయిన్ ఫై రష్యా కూడా దాడులు ఆపేస్తే ప్రపంచ శాంతి.ఖాయం.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..
