సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 6,238 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.♦ మొత్తం పోస్టులు సంఖ్య : 6,238 ♦ టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు -183 ♦ టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు : 6,055 ♦ అప్లికేషన్ : ఆన్ లైన్ ద్వారా ♦ అప్లికేషన్లు ప్రారంభం – జూన్ 28 నుంచి ♦ చివరి తేదీ : జులై 28వ తేదీ వరకు. ♦ అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250, ఇతర అభ్యర్థులకు రూ. 500. ♦ ప్రారంభ వేతనం: టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ కు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-3 కు రూ.19,900 నుంచి ప్రారంభ వేతనం ఉంటుంది.ఇతర అలవెన్సులు ఉంటాయి.
