సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శుక్రవారం డి.యన్.ఆర్ కళాశాల లో వ్యవస్దాపక దినోత్సవాన్ని మరియు అల్లూరి సీతారామ రాజు జయంతి ని ఘనంగా నిర్వహించారని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలకమండలి అడ్జక్షుడు గోకరాజు వెంకట నరసింహరాజు మరియు కళాశాల కార్యదర్శి మరియు కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 1945 జులై4 వ తేదీన శ్రీ దంతులూరి నారాయణరాజు గారు ఇతర పెద్దలు కలిసి నాటిన విత్తనం దినదినాభివృద్ధి చెంది యూనివర్సిటీ స్దాయికి ఎదిగిందని ,80 సంవత్సరాలు నిండి 81 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభసందర్బా సిబ్బందికి విద్యార్ధినీ విద్యార్ధులకు వ్యవస్దాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా డి.యన్.ఆర్ కళాశాలో 1975 సంవత్సరంలో జిల్లాలో తొలిసారి జియాలజి సబ్జెక్టును ప్రవేశ పెట్టగా నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయినదని, జియాలజి విభాగంలో పేరొందిన అధ్యాపక సిబ్బంది పనిచేసారని, ఈ కళాశాలలో జియాలజి చదివిన విద్యార్ధులు లలో అత్యధికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మరియు మైన్స్, ఓ.యన్.జి.సి, సాప్ట్ వేర్ సంస్దలలో ఉన్నత ఉద్యోగులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా ( సిగ్మా న్యూస్ ప్రసాద్ కూడా DNR లో ఒకనాటి జియాలజీ స్టూడెంట్ కావడం గమనార్హం) పూర్వ మరియు ప్రస్తుత సిబ్బందికి మరియు విద్యార్ధినీ విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుండి బి.యస్.సి నర్సింగ్ కోర్సును కళాశాలలో ప్రారంబింస్తున్నామని, అలాగే న్యాక్ వారు ఇంజనీరింగ్ కళాశాలకు A++, డిగ్రీ కళాశాలకు A+ రావటం కళాశాలకు గర్వకారణం అని తెలిపారు. కళాశాలలో పాలకవర్గం సభ్యులు ప్రిన్సిపాల్స్, అధ్యాపక అద్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *