సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ.. నిజం నిష్ఠురం అయినా.. జగన్ ఎంతటి శక్తిమంతుడంటే.. వైసీపీ కి ఒంటరి ఏ పార్టీ ఎన్నికల బరిలో దిగిన వారికీ వీర మరణమే .. ఈసారి జనసేన ఒంటరిగా పోటీ చెయ్యదు.. కూటమి తోనే ఢీ కొనాలి.. అని అన్నమాట మరోసారి రిపీట్ చేసారు. సీట్లు తక్కువచ్చిన 40 శాతం ఓటింగ్ సాధించిన వైసీపీ నేతలలో.. ఇటీవల కూటమి లో కుమ్ములాటలు వార్తలతో జోష్ పెరిగిందని గ్రహించిన పవన్ కళ్యాణ్, మార్కాపురం లోని జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.1,290 కోట్లతో చేపడుతున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ తో అధికారంలో లేనప్పుడు, రెండు చోట్ల ఓడిపోయినప్పుడే పోరాటం చేశానని, ఇక్కడ ఉన్న మీతోపాటు నాకూ గుండెల్లో దమ్ము, రక్తంలో వేడి ఉందన్నారు. రాజకీయాల్లో తాను సినిమా డైలాగులు చెప్పనని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. రప్పా రప్పా కోస్తాం..మెడకాయలు కోస్తామని సినిమా డైలాగ్స్ తో బెదిరిస్తే తామేమైన చొక్కాలు విప్పుకొని ఉన్నామా? అని వ్యాఖ్యానించారు. అసలు మళ్లీ 2029లో మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం.’’ అని పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మా కూటమిలో కొన్ని అంతరాలు ఉండవచ్చు.. అయితే వైసీపీని అధికారంలో రాకుండా చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయని, వైసీపీ ఆటలు సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *