సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తొలి ఏకాదశి నుంచే హిందువుల అన్ని పండుగలు ప్రారంభమవుతాయి అన్నది హిందూ సంప్రదాయం. మరి ఈ తొలి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణగాదలు చెబుతున్నాయి. నేడు, ఆదివారం నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఏడాది మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్ధం. మనుకున్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సుతో కలసి పదకొండు. ఇవన్నీ ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి దీనినే హరివాసరం అని కూడా అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే భూదాన మిచ్చనంత, అశ్వమేధయాగం చేసినంత, 60 వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, ఆదివారం సెలవు కూడా కావడంతో భీమవరం లో అన్ని వైష్ణవ దేవాలయ లతో పాటు పంచా రామం, శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయాల ప్రాంగణాలు భక్తుల సందడితో. దర్శనాలు, ప్రసాద వితరణలు తో ఆధ్యాత్మిక శోభతో కళకళ లడాయి.
