సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నేడు, ఆదివారం ఉదయం స్థానిక లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు కొట్లాట తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. చర్చిలో ప్రార్థన చేసేందుకు వచ్చిన పాస్టర్లు చంద్రశేఖర్, నవ కుమార్ నేను ముందు పార్ధన చేస్తానంటే.. నేను ముందు.. అంటూ గొడవకు దిగారు. చర్చ్ లో అందరూ చూస్తు్ండగానే ఒక్కసారిగా రెండు వర్గాలుగా విడిపోయి వారు అనుచర వర్గాలు కొట్టుకొన్నాయి పాస్టర్లకు మద్దతుగా చర్చి కమిటీ సభ్యులు రెండుగా విడిపోయి ఒకరినొకరు చొక్కాలు చింపుకునే వరకు పరిస్థితి వెళ్లింది. మహిళలు పిల్లలు ఉన్నారని కూడా పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలకు నచ్చజెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
