సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మూడేళ్ళ క్రితం 2022లో వచ్చిన ‘కాంతార’ (Kanthara) సినిమా కన్నడ చిత్రసీమను పాన్ ఇండియా స్థాయిలో గర్వపడేలా 350 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. ఇక ఆ సంగీతం కోట్లాది ఫోన్ లలో రింగ్ టోన్ గా మారింది. కాంతారా సినిమా తెలుగు తో సహా వివిధ భాషల్లో డబ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించి ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (Rishab Shetty) కి జాతీయ పురస్కారాన్ని అందించింది. ‘కాంతార’ సినిమా కు ముందు జరిగిన కధ గా ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1( Kantara Chapter1)రూపొందిస్తున్నవిషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు చిత్ర బృందంలో విచిత్రంగా నలుగు ఐదుగురు చనిపోవడంతో ఈ చిత్రం షూటింగ్ వార్తలలో నిలచింది. తాజాగా ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే అక్టోబర్2 గాంధీ జయంతి రోజునే విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ నేడు, సోమవారం ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘కాంతార’లో భూత కోలా కన్నడ జానపద సంప్రదాయాన్ని, ప్రకృతితో సంఘర్షించకుండా ఉండాలని కాంతారలో చూపించారు.
