సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఏడాది పాలన పూర్తీ చేసుకొన్నా కూటమి ప్రభుత్వం ముందు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు తమ అసంతృప్తి ప్రకటిస్తున్నారు.. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యా యుల జేఏసీ నాయకులు పిలుపుతో తాజగా నేటి సోమవారం నుండి ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ పీఆర్సీ సవరణకు హామీ ఇచ్చి రెండు సంవత్సరాలైనా ఇంకా కమిషనర్ ను నియమించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు ప్రతిపక్షం లో ఉన్నపుడు తమకు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతున్నామని జెఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యో గులు ఇప్పటికే గేట్ మీటింగ్‌లు, ధర్నాలు ప్రమోషన్లు ఇవ్వడం లేదని, డీఏలు, సరెండ్ ల అంశం లోనూ ఎలాంటి నిర్ణయం రాకపోవడం పై ఎం పీఆర్సీ బకాయిలుఫై పీటీడీ (ఆర్టీసీ) ఉద్యో గుల సమస్యలు ఫై రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలలోను, నాలుగు వర్కు షాపులలో ఆర్టీసీ ఉద్యో గులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.. ఆర్టీసీ అన్ని డిపోల వద్ద ధర్నాలు జరిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ కోసం మరో 3వేల బస్సులు కొనుగోలు చేయాలి. మరో 10 వేల మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.. పంచాయితీ కార్యదర్శులు కూడా ఏపీఎన్జీజీజీవోతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు మరో 2 నెలలు తరువాత పెద్ద ఎత్తున సమైక్యంగా ఉద్యమించడానికి సిద్ధం అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *