సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరుజిల్లా రాజకీయాలలో సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కీలక వైసీపీ నేత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటిపై గత రాత్రి పలువురు దాడి చేసి ఇంట్లో ఫర్నిచర్ ను వాహనాలను ద్వంసం చేసి ఇంట్లో మహిళలను భయభ్రాంతులు చేసిన నేపథ్యం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. నెల్లూరు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో టీడీపీ వారికీ సవాళ్లు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ వెంటనే ఫోన్ లో ప్రసన్న కుమార్ రెడ్డి ని పరామర్శించారు. దీనిపై నేడు, మంగళవారం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన.. తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని అన్నారు. తాను ఇంట్లో ఉంటే కచ్చితంగా తనను చంపేసేవారని పేర్కొన్నారు దీని వెనుక టీడీపీ శ్రేణులు, ప్రస్తుత ఎంపీ , ఎమ్మెల్యేలుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ప్రశాంతి రెడ్డిభార్యాభర్తల హస్తం ఉందని ఆరోపించారు. ఇది టీడీపీ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. తనపై హత్యాయత్నం చేశారని, తాను ఇంటిలో ఉంటె చంపేసేవారని దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై చంద్రబాబు పవన్ స్వాందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్వాందించిన ఉప సీఎం పవన్ కళ్యాణ్.. ప్రసన్న కుమార్ రెడ్డి గత మీటింగ్ లో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ని అసభ్య పదజాలంతో మాట్లాడారని టీడీపీ వారిని రెచ్చగొట్టారని మహిళల పట్ల సభ్యతగా వ్యవహరించాలని అన్నారు.
