సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో షాపు యజమానులు వారి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్త చెదారములు షాపులు వ్యాపారములు ముగించుకొనిన పిదప చెత్తను ఒక డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకొని, సదరు చెత్తను మున్సిపాలిటీ వాహనమునకు ఇవ్వాలని ఆలా కాక రోడ్లపైన, మురుగు కాలువలలో చెత్త వేసిన యెడల అట్టి వారిపై మొదటిసారిగా అపరాధ రుసుము విధించబడును. రెండవ పర్యాయము తనిఖీ చేసిన సమయములో వ్యాపారస్తులలో మార్పురాని యెడల సదరు షాపు సీజ్ చేసి మూసివేయబడును. దీనితో పాటు నిషేదిత ప్లాస్టిక్ వస్తువులు విక్రయము జరుపుతున్న హోల్ సేల్ షాపులపై నిరంతర నిఘా నిమిత్తం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసారు. అధికారులుగా కానూరి శ్రీనివాస్, జంపన సత్యనారాయణ రాజు, హెల్త్ అసిస్టెంట్ లఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తులో హోల్ సెల్ ఏజెన్సీల వద్ద రూ 6,500/- పెనాల్టీ గా వసూలు చేయుట జరిగినది.ప బ్లిక్ ప్రదేశాలలో బి. వి. రాజు పార్క్ వద్ద ఏర్పాటు చేయబడిన స్టాల్స్ వద్ద వ్యాపారుల నుండి చెత్త వేసినందులకుగాను అపరాధ రుసుముగా రూ. 10,500/-లు యస్. చంటి బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ వారు వసూలు చేయుట జరిగినది. పట్టణములో ప్రతి ఒక్కరూ క్లాత్ సంచులు, జూట్ సంచులు వినియోగించవలేనని, ప్లాస్టిక్ రహిత స్వచ్చ భీమవరం గా మార్పు చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించ వలేనని కె. రామచంద్రా రెడ్డి, కమిషనర్ , ఎ. రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ సోమశేఖర్, హెల్త్ ఆఫీసర్ విజ్ఞప్తి చేస్తున్నారు.
