సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పర్యాటకులను అలరించే పచ్చని ప్రక్రుతి సోయగాలతో అందమైన సముద్ర తీరప్రాంతంకు వారగా కొండలపై నిర్మించిన చక్కటి కార్పొరేట్ నిర్మాణాలు దానికి తోడు అంతర్జాతీయ స్థాయి ‘కాస్మో లుక్’ హంగులతో అలరిస్తున్న విశాఖ పట్నం కూడా త్వరలో బెంగళూర్ హైదరాబాద్ కు పోటీగా బడా ఐటీ కంపెనీలు ఏపీ హబ్ గా మారుతుంది. గత 2 ఏళ్లుగా దిగజ్జలయిన ఐటి కంపెనీలు ఒక్కొక్కటిగా విశాఖ రావడంతో మరింత జోష్ పెరిగింది. .అయితే తాజా సంచలనం ఏమిటంటే.. ఇక్కడ పదేళ్లుగా బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం)లో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్‌ కంపెనీని ఫ్రాన్స్‌కు చెందిన పేరొందిన కంపెనీ ‘క్యాప్‌జెమిని’ కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థలో 65 వేల మంది ఉద్యోగులు ఉండగా ఒక్క విశాఖలోనే 5000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ అద్దె భవనంలో నడుస్తుండగా.. ఈ ఏడాది చివరికల్లా విశాఖలో క్యాప్‌జెమినికి కూడా భూమి ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఏఐ టెక్నాలజీ సేవలు కూడా అందించాలని క్యాప్‌జెమిని భావిస్తోంది. దీంతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే విశాఖలో టీసీఎస్‌, కాగ్నిజెంట్‌కు గూగుల్‌ కూడా ప్రభుత్వం భూములు కేటాయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *