సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ నేడు, బుధవారం లెఫ్ట్ పార్టీలు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టణాలలో భారీ ఎత్తున కార్మికులు సీఐటీయూ సిపిఎం, సిపిఐ తదితర పార్టీల ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం పట్టణం ఎర్ర జెండాల తో వేలాది కార్మిక సోదరుల నినాదాలతో ర్యాలీ లతో అరుణోదయం కనపడింది. ప్రకాశం చౌక్ సెంటర్ దిశగా ప్రధాన రోడ్లపై భారీ ర్యాలీ లు , ఎం ఆర్ ఓ మరియు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఎదుట నిరసన ప్రదర్శనలు, విన్నతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించాయి కార్మిక నేతలు మాట్లాడుతూ.. దేశంలో 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికుల పొట్టను కొట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినటువంటి కార్మికులను చట్టాలను మారుస్తూ కార్మికుల జీవితాలను రోడ్డున పడేస్తుందని, ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రవేటు ఉద్యోగాలను పర్మిట్ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన అమలు కాలేదని అన్నారు. తణుకులో కూడా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు భారీ ర్యాలీ లో పాల్గొన్నారు.
