సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు అగ్ర హీరోల సినిమా దగ్గరే మొదలైన రీ-రిలీజ్ ట్రెండ్ ‘ఖలేజా’ రి రిలీజ్ లో 11 కోట్ల రూపాయలు కొల్లగొట్టే స్థాయికి చేరుకొంది. ఇప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్ ఇండియన్ సినిమా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మరో తరహా రి రిలీజ్ ట్రెండ్.. 10 ఏళ్ళ క్రితం వచ్చిన ‘బాహుబలి’ మరియు 8ఏళ్ళ క్రితం వచ్చిన బాహుబలి 2 కలపి ఒకేసారి ఒకే సినిమాగా ఎడిటింగ్ చేసి 4గంటల సినిమా సరికొత్త ప్రయోగంతో మరోసారి తెరపైకి భారీ రి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శ కత్వంలో రూపొందిన ఈ భారీ సిరీస్ ను వచ్చే అక్టోబర్ 31న ‘బాహుబలి – ది ఎపిక్’ పేరుతో సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. భీమవరం బ్రాండ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానుల్లో మాత్రం ఈ వార్త జోష్ నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *