సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై నేటి సోమవారం తెల్లవారు జాము వంటిగంట సమయంలో బత్తాయిలతో వస్తున్నాలారీ బోల్తా పడి తొమ్మిది మంది రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలు మృతిచెందగా..వారిలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం గమనార్హం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
