సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండోనేషియాలో నేడు, సోమవారం ఉదయం 10గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రత నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే, గతంలోలా సునామీ వచ్చే అవకాశం లేదని ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపం 98 కి.మీ (60.89 మైళ్ళు) లోతులో ఉందని తెలిపింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) భూకంపం 6.7 తీవ్రతతో, 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో నమోదైందని నివేదించింది. అష్టి ప్రాణ నష్టాలపై ఇంకా పూర్తీ సమాచారం అందవలసిఉంది.
