సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న దివంగతులు అయిన సినీ మహా నటులు .. కోట శ్రీనివాస్ రావు ప్రపంచ తెలుగు వారి నుండి ఎన్నో సత్కారాలు, అవార్డులు అందుకొన్నారు. అయితే అన్నింటికన్నా విశిష్టమైనది.. 2న్నర దశాబ్దాల క్రితం భీమవరంలో పురవీధులలో ఊరేగి ఘన సన్మానం అందుకోవడం స్థానిక ప్రజలు స్మరించు కొంటున్నారు.భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 37వ వార్షిక మహోత్సవంలో శ్రీ అమ్మవారి అస్సిసులు అందజేసి కోట శ్రీనివాసరావు గారికి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉత్సవ వేదికపైన పుర ప్రముఖుల సమక్షంలో వేలాది ప్రజల మధ్య సువర్ణ హస్తా కంకణంతో ఘన సన్మానం చేయడం జరిగినది. ( ఫై ఫోటో అప్పటిదే)
