సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే మెగా డీఎస్సీ వచ్చినా ఏపీపీఎస్సీ ద్వారా ఇదే తొలి నోటిఫికేషన్. అటవీ శాఖలో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. అర్హులయిన అభ్యర్థులు ఈనెల 16 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్పోర్ట్స్ కోటా ఖాళీలు, ఎస్సీ గ్రూపుల వారీగా ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలను రెన్యువల్ చేస్తూ ఉన్నత విద్యా శాఖ గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 693 మంది లెక్చరర్ల సేవలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
