సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా వెలువడిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఈ 4 రోజులు చంద్రబాబు స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించారు.అయితే అధికారికంగా ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు జనసేన పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ నింపాయి. up file photo.
