సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ సీఎంలు నారా చంద్రబాబు , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సమావేశం అయ్యారు. నేటి బుధవారం మధ్యాహ్నం నుండి సమావేశం కొనసాగుతుంది. ఒకనాటి గురు శిష్యులే కావడంతో ఒకరినొకరు మర్యాదపూర్వకంగా సన్మానించుకొని సమావేశం ప్రారంభించారు. నీటి పారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, సీఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి బనకచర్ల సింగిల్ పాయింట్‌ను ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో పెట్టింది. పాలమూరు -రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత – చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. దీనిపై ఇరు రాష్ట్రాల మంత్రులు అధికారులు తమ తమ వాదనలు వినిపించారు.
