సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతిలో వచ్చే సెప్టెంబరు 14, 15 తేదీలలో జరగనున్న “మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల అఖిల భారత సమావేశం” నిర్వహణపై శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు అధ్యక్షతన ఈరోజు తిరుపతిలో జరిగిన సన్నాహక సమావేశంలో ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. నేటి బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకొన్న ఆయన .. తిరుపతి జిల్లా ప్రాశస్త్యం అందరికీ తెలిసేలా ఈ జాతీయ స్థాయి మహిళా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి సత్య ప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు , తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు , పలువురు ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *