సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బృందం 5 రోజుల పర్యటన కోసం సింగపూర్‌(Chandrababu Singapore) లో నేడు, ఆదివారం చేరుకోగానే అక్కడ స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు 29 కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. నేటి ఆదివారం మధ్యాహ్నం తెలుగు డయాస్పోరాతో జరిగే సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడం, పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.. గత 2014 లో అధికారం లో వచ్చినప్పుడు కూడా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలకు ఇదే తరహా అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *