సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో మల్టి ప్లెక్స్ లు నిర్మించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాటలోనే మాస్ మహారాజా రవితేజ (Ravi Teja ) సైతం సినిమా కార్పొరేట్ బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన ఏఆర్టీ సినిమాస్ (ART Cinemas) అంటూ మల్టీప్లెక్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనిలో కార్పొరేట్ బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ హోటల్స్ ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ తూర్పు (ఈస్ట్)లో ఏసియన్ (Asian) సునీల్ భాగస్వామ్యంతో నిర్మించిన ఓ భారీ మల్టీఫ్లెక్స్ను రేపు గురువారం కింగ్డమ్ (Kingdom) సినిమాతో గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రవితేజ తో పాటు హీరో విజయ్ దేవరకొండ అండ్ టీమ్ రానున్నట్లు సమాచారం. విజయవాడ హైవేపై వనస్థలిపురం ప్రధాన కూడలిలో ఉన్నఈ కొత్త మల్టీప్లెక్స్ లో 6 స్క్రీన్లు ఉండనుండగా, ప్రపంచ స్థాయి సినిమా ఫీచర్స్ ఉన్న 4కే క్వాలిటీ ప్రొజెక్షన్, అల్ట్రా క్లియర్ విజువల్స్‌తో 57 అడుగుల వెడల్పు భారీ స్క్రీన్ సైతం ఏర్పాటు చేశారు. వీటిలో 1, 2, 5, స్క్రీన్లు డాల్బీ 7.1 లేజర్ ప్రోజెక్షన్ (dolby 7.1 with laser projection) తో ఉండగా 3,4,6 స్క్రీన్లు డాల్బీ అట్మోస్ లేజర్ ప్రోజెక్షన్ (dolby Atmos with laser projection )తో ఉన్నాయి. అయితే ఇందులొనే 6వ నంబర్ స్క్రీన్ ఎపిక్ (EPIQ screen) స్క్రీన్‌గా భారీగా ఏర్పాటు చేసారు.
