సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో నేడు, బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం (Russia Earthquake) సంభవించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ప్రారంభంలో 8.7 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత 8.8గా సవరించబడింది. ఈ తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3-4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డయ్యాయి.రష్యాలోని జనావాసాలు తక్కువగా ఉండే కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3-4 మీటర్ల ఎత్తుతో తాకాయని, ఎవరికి గాయాలు లేనప్పటికీ, ఒక కిండర్‌గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. సునామి వస్తే మాత్రం..
