సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై కనీసం 50% మార్కులతో పాస్ అయినవారు NCVT లేదా SCVT సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉన్నవారికి రైల్వే జాబ్స్ కోసం చేస్తున్నవారికి గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC తూర్పు రైల్వే), RRC ER అప్రెంటిస్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 14 ఆగస్టు 2025 నుంచి మొదలై 13 సెప్టెంబర్ 2025 వరకు కొనసాగుతుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://er.indianrailways.gov.in/ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.అలవెన్స్ లతో సుమారు 40 వేల వరకు జీతం ..అభ్యర్థుల వయసు 15 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
