సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫై దశలవారీగా నిరసనలు చేపట్టేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల జేఏసీ పిలుపునిచ్చింది. ఈనెల 7న నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, 11వ తేదీ నుంచి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, 18న విజయవాడలోని ధర్నాకు హాజరుకావాలని లెక్చరర్లను కోరింది. ‘ఎన్నిసార్లు అడిగినా డిగ్రీ అధ్యాపకుల బదిలీలు చేపట్టడంలేదు. గతంలో ఎయిడెడ్‌ కాలేజీలకు గ్రాంట్‌ నిలిపివేసినప్పుడు జీవో 42 తీసుకొచ్చిన ప్రభుత్వ లెక్చరర్‌ పోస్టుల్లో ఎయిడెడ్‌ లెక్చరర్లను నియమించింది. అనంతరం ఎయిడెడ్‌ కాలేజీలకు గ్రాంట్‌ పునరుద్ధరించినా వారిని అక్కడే కొనసాగిస్తోంది. ప్రమోషన్స్ లేవు.. దీనిపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదు’ అని వారు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *