సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో చినఅమీరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతులు ఖాతాల్లో మొదటి విడత అన్నదాత సుఖీభవ ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడంతో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని రైతులకు ఎన్డీఏ కుటమీతోనే మేలు జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి రైతు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇవ్వడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో రైతు సంబర సభలు నిర్వహిస్తున్నా మన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు కలిదిండి రామచంద్రరాజు, భీమవరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి కోళ్ల సీతారాం మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు నీటి సంఘ అధ్యక్షులు గొట్టముక్కల మురళీకృష్ణంరాజు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు ఏఎంసి డైరెక్టర్ మైగాపుల గంగారం టిడిపి నాయకులు రేవు వెంకన్న రామసీత గోట్టుముక్కల విశ్వనాథరాజు గొట్టుముక్కల శ్రీహరిరాజుతదితర నేతలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *