సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాకర విద్య సంస్థగా దశాబ్దాలుగా పేరు గాంచిన.. భీమవరం స్దానిక దంతులూరి నారాయణరాజు కళాశాలో ఈ నెల 30 వ తారీకున పూర్వవిద్యార్దుల సమావేశం ఏర్పాటు చేయటమైనదని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) తెలియజేసారు. ఈ సమావేశానికి అదిక సంఖ్యలో కళాశాల పూర్వ విద్యార్దులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశానికి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు బాబు, కళాశాల సంయుక్త కార్యదర్సి కె.రామకృష్ణంరాజు మరియు ఉపాదక్షులు జి.పాండురంగరాజు గార్లు కళాశాల పూర్వవిద్యార్ది అయిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కి సమావేశ ఆహ్వాన పత్రిక అందించారు. తమ కళాశాల పూర్వవిద్యార్ధులు కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులు గా, న్యాయమూర్తులుగా, ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ లు మరియు అనేక అత్యున్నత హోదాలలో ఉన్నారని తెలిపారు.
