సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం పాన్ ఇండియా స్థాయిలో 2 భారీ మల్టీస్టార్ సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. వీటిలో సీనియర్ క్రేజీ స్టార్స్ రజనీకాంత్ హీరోగా , నాగార్జున తొలిసారి విలన్ గా ‘కూలి’ సినిమా ఓపెనింగ్స్ అదరగొట్టింది. ఈ సినిమా టాక్ మిశ్రమంగా డివైడ్ టాక్ వచ్చింది. రజని కాంత్ పాత్ర మరింత శక్తివంతంగా ఉంటె బాగుండునని, నాగార్జున మాత్రం విలన్ గా స్టయిలిష్ గా అదరగొట్టాడని, ఉపేంద్ర, అమిర్ ఖాన్ పాత్రలు కూడా కాస్త ఫన్నీ జోడించడం వల్ల కాస్త మెరిసాయి తప్ప సినిమా రేంజ్ పెంచలేకపోయాయని అంటున్నారు. సినిమా ఇంటర్ వెల్ వరకు ఓ రేంజ్ లో ఉందటున్నారు. సెకండ్ హాఫ్ ఆ స్థాయిలో లేదు.అనిరుద్ బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ కనకరాజు తనదయిన ఫాంటసీ తరహా స్క్రీన్ ప్లై టేకింగ్ ఇష్టపడే వారు తప్పక చూడవలసిన సినిమా కూలి.. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన పాన్ ఇండియా సినిమా వార్ 2. ఎన్టీఆర్‌, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం. కియారా అద్వానీ క‌థానాయిక‌. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ఇద్దరి ఎంట్రీలు అదిరిపోయాయని అంటున్నారు. ఎన్టీఆర్‌, హృతిక్‌ల న‌ట‌న అదుర్స్ అని చెబుతున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్ నెక్ట్స్ లెవ‌ల్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు కాస్త గ్రాఫిక్స్ క్వాలిటీ సంతృప్తిగా లేరు.. స‌లామే సాంగ్‌లో ఇద్ద‌రూ పోటాపోటీగా డ్యాన్స్ చేశార‌ని.. ప్రీత‌మ్ కంపోజ్ చేసిన ఊపిరి ఊయ‌ల‌గా సాంగ్ విజువ‌ల్ గా అట్రాక్టివ్‌గా ఉంద‌ని అంటున్నారు. అయాన్ ముఖ‌ర్జి ద‌ర్శ‌క‌త్వం బాగుందని, ఎన్నో దేశాలలో సినిమా తియ్యడం వాళ్ళ ఓ హాలీవుడ్ సినిమా చూసిన‌ట్లుగా ఉంద‌ని టాక్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *