సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లోని ఎర్రకోట వేదికగా నేడు, శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, ‘ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.అన్నారు. ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్. మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు. పహల్గామ్లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ధి చెప్పింది. ఇకపై బ్లాక్మెయిల్ చేసేవారిని ఉపేక్షించేది లేదు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడేది లేదు.సింధూ నదిలో నీరు భారత రైతుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు. దేశ యువతకు మోదీ వరాలు కురిపించారు. ఇవాళ్టి నుంచి దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం అమల్లోకి తెస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పీఎం వికసిత్ భారత్ యోజనతో 3.5 కోట్లమంది యువతకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే యువతకు రూ.15 వేలు ఇస్తామని అన్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటుతో GST సంస్కరణలు తెస్తామని.. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. మనం సృష్టించిన UPI ప్రపంచంలో మనశక్తిని చాటుతోందని అన్నారు. ప్రపంచానికి ఫార్మా కేపిటల్గా భారత్కు పేరుందని అన్నారు. వ్యాక్సిన్ల తయారీలోనూ మనం సత్తా చాటుతున్నట్లు చెప్పారు. ఇది ఐటీ యుగం.. ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి AI వరకు అన్నీ మనవే కావాలని ప్రధాని మోదీ అన్నారు.
