సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ గౌరవ కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. రూ.7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని పవన్ చెప్పారు. 2024లో రూ.380 కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర పాలన కోసమే 15 ఏళ్ల పాటు మా కూటమి ప్రభుత్వం ఉండాలన్నారు. పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది మా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఏకపక్షంగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాలపై మాట్లాడిన పవన్.. వైసీపీ వాళ్లు.. గెలిస్తే ప్రజాతీర్పు అంటారు.. కూటమి గెలిస్తే EVMల తప్పా?రిగ్గింగ్ చేశామా? అంటూ ఎద్దేవా చేశారు.రాహుల్ గాంధీ పక్క ఆధారాలతో 5 రకాల పద్దతులలో దేశ వ్యాప్తంగా జరిగిందని చెపుతున్న ‘ఓటు చోరీ’ ఫై మాత్రం పవన్ స్వాందించలేదు.
