సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో భీమవరం టిడిపి కార్యాలయం వద్ద 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల త్యాగాలను మరిచిపోకూడదని ఈనాటి స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితంమన్నారు.ఈవేడుకలో భీమవరం పట్టణ టిడిపి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము చల్లబోయిన గోవింద్ ఏఏంసి మాజీ చైర్మన్ ఇందుకురి రామలింగరాజు మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ఏపీ గౌడ,రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య ఉప్పులూరి చంద్రశేఖర్ ఏఏంసి డైరెక్టర్ ఎద్దు కాంతామని ఎద్దు యేసుపాదం పట్టణ మాజీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు తదితర నేతలు పాల్గొన్నారు.
