సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని గత రాత్రి రామంతాపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రధం లాగుతున్నప్పుడు విద్యుతు షాక్ తో జరిగిన విషాదంలో నేటి సోమవారం ఉదయనికి మృతుల సంఖ్యా 6 కు చేరుకొంది. వీరి కుటుంబాలకు 5 లక్షల చప్పున తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించింది. నేడు ఉదయం విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 11 కేవీ విద్యుత్ తీగకి ఇంటర్నెట్ కేబుల్ కండక్టర్ వైర్ కాంటాక్ట్‌లో ఉందని తెలిపారు. దీంతో ఇంటర్నెట్ కేబుల్లో కూడా కరెంట్ పాస్ అవుతోందని పేర్కొన్నారు. ఆ ఇంటర్నెట్ కేబుల్ శోభాయాత్రలోని రథానికి తాకి.. రథం మొత్తం కరెంట్ సరఫరా అయ్యిందని చెప్పారు. తక్షణ చర్యగా ఇక్కడ ఉన్న ఇంటర్నెట్ కేబుల్ వైర్లు అన్నీ తొలగించి.. వచ్చే పండుగల నేపథ్యంలో కిందకు ఉన్న విద్యుత్ తీగలను సరిచేస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *