సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రభుత్వం తాజగా కొత్త బార్ పాలసీని ప్రకటించింది. లైసెన్స్‌ ఫీజుల నుంచి షాపుల కేటాయింపు వరకు అన్ని రూల్స్‌లో సరికొత్త మార్పులు చేసింది. కొత్త నిబంధనలతో సిండికేట్లకు చెక్‌ పడుతుంది. ఈనెల 28న లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ఉంటుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లు ఉండగా.. ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలనే నిబంధన సడలించి 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఇక.. లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గించారు. . దానిలో భాగంగా.. 50 వేల లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు 55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే 75 లక్షల లైసెన్స్‌ ఫీజు ఉంటుంది. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని… ఇక.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుంది.ఇక తాగినోడికి తగినంత సమయం.. అన్ని కేటగిరీల్లో దరఖాస్తు ఫీజు 5 లక్షలుగా నిర్ణయించారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 28న కలెక్టర్ లాటరీ తీసి ట్రాన్స్‌పరెంట్‌గా బార్లు కేటాయిస్తారు. . సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *