సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న కోర్టులలో అవసరమైన పలు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి నేటి బుధవారం నుండి (ఈనెల 20 )ఈనెల 24వ తేదీ వరకు పరీక్షల నిర్వహిస్తున్నారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు కోర్టులలో స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ తదితర పోస్టులకు జారీ చేసిన నోటిఫికేష్కు 4,207 మంది అభ్యర్థులు దరఖాస్తు చెయ్యగావీరికి ఈనెల 20 నుంచి 24 వరకు మూడు కేంద్రాలలో అంటే ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, సిద్దార్ధ క్వెస్ట్ కళాశాల, భీమవరంలోని డీఎన్ఆర్ కళాశాల కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.. పరీక్ష ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. స్టెనో గ్రాఫర్ గ్రేడ్–3, టైపిస్ట్, కాపియిస్ట్, డ్రైవర్ పోస్టులకు కంప్యూటర్ పరీక్షలతో పాటు నైపుణ్యం పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక సమస్యలు, తదితర సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థుల కోసం 0863–2372752 నంబరుతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసారు.
