సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఓట్ల దొంగతనంలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ), బీజేపీ భాగస్వాములని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌) ద్వారా వచ్చే ఎన్నికలలో బిహార్లో ఒక్క ఓటును కూడా చోరీ కాకుండా అడ్డుకొంటామని స్పష్టంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహులే ప్రధానమంత్రి అవుతారని ఆర్‌జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ అన్నారు. ‘ఓటర్‌ అధికార యాత్ర’లో మూడోరోజు వారు నవాడాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఎన్నికల కమిషనర్లు ఓటు హక్కును ప్రజల నుంచి లాక్కుంటున్నారు. ఎన్నో రాష్ట్రాల ఎన్నికలను ఇలాగే దొంగిలించారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నడుమ మేజిక్‌ చేసి ఏకంగా కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. EVM మెషీన్‌లో చదవగలిగే ఓటర్ల జాబితాలను మాకివ్వాలని ఈసీని మేం కోరాం. కానీ కమిషన్‌ దానితోపాటు సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వడానికీ నిరాకరించింది. అని రాహుల్‌ స్పష్టంచేశారు. ఇప్పుడు మీ ఓట్లు తీసేస్తారు.. తర్వాత రేషన్‌ కార్డులు తొలగిస్తారు.. అనంతరం మీ భూములు లాక్కుంటారు.. వాటిని అదానీ, అంబానీలకు ఇచ్చేస్తారని ఆరోపించారు. తప్పుడు చట్టాలు, జీఎ్‌సటీ, పెద్దనోట్ల రద్దు ఇవన్నీ అధికార బీజేపీ కి మేలు చేయడానికేనని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *