సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో కష్టపడకుండా అయాచితంగా డబ్బు సంపాదించాలని కొందరు యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లమాయలో పడి, వాటికీ సెలబ్రెటీల ప్రచారం మాయలో పడి . సర్వము కోల్పోయి ఆత్మహత్య లకు పాల్బడుతున్న ఘటనలు కోకొల్లలుగా రోజు చూస్తున్నాము. చాల ఆలస్యం అయినప్పటికీ ఎట్టకేలకు కేంద్రం దీనిపై ద్రుష్టి పెట్టింది. ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025’ను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేడు, బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.. ఈ – స్పోర్ట్స్, భారతీయ విలువలతో విద్యార్థులకు విజ్ఞాన కరమైన సోషల్ గేమ్స్‌కు ప్రోత్సాహం, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై నిషేధం విధిస్తారు. అలాగే యువత, కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకు వస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ, పోకర్ వంటి గేమ్స్‌పై నిషేధం విధిస్తారు.ఆన్‌లైన్ మనీ గేమ్స్ ప్రకటనలు, లావాదేవీలు నిషేధం – బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్స్ మాత్రం బ్లాక్ చేస్తారు. కేంద్ర స్థాయిలో ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు సంసిద్ధత. నిబంధనల ఉల్లంఘనకు జైలు శిక్షలు, రూ. కోట్లాది జరిమాన విధిస్తారు.
