సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ జిల్లా సమీపంలో ఉన్న యానాం ( పాండిచ్చేరి రాష్ట్రము)లో ONGC గ్యాస్‌ పైప్‌లైన్ నేడు, శుక్రవారం లీక్ అయ్యింది. సముద్రం నుంచి యానాం మీదుగా వెళ్లే.. చమురు సంస్థల గ్యాస్‌పైప్‌ లైన్ ఒక్కసారిగా లీక్ అయ్యింది. దీంతో భారీగా మంటలు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు భయందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అధికారులుకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన చమురు సంస్థల అధికారులు గ్యాస్ సరఫరాను సముంద్రంలోనే నిలిపివేశారు. ఈ భారీ గ్యాస్ లీక్ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే నేటి తెల్లవారు జామున 2గంటల సమయంలో కాకినాడ సమీపంలోని తాళ్లరేవు దగ్గరగా భారీగా గ్యాస్ లీక్ అయ్యి మంటలు రావడంతో ప్రజలు భయ ఆందోళనలు చెందటం అధికారులు 2 గంటల పాటు కష్టపడి మంటలు అదుపులోకి తేవడం జరిగింది. దీనిపై సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లా కలెక్టర్ ను వివరాలు అడగటం జరిగింది.అయితే గత అనుభవాల దృష్ట్యా తరుచుగా కోనసీమ లో ఈ గ్యాస్ లీకేజీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *