సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం.. గం..గం..గణపతియే నమః .. సర్వ శుభ ప్రదాత అన్ని గణాలకు అధినేత శ్రీ విఘ్నేశ్వరుడు..మరో 5 రోజులలో శ్రీ వినాయక చవితి పర్వదినం (sri vinayaka chaviti) సందర్భముగా భీమవరం పట్టణంలో వాడవాడలా స్థానిక యువత ఆధ్వర్యంలో వందలాది చవితి పందిళ్ళ సిద్ధం చేస్తూ లైటింగ్ అలంకరణలతో సందడి కనిపిస్తుంది. పట్టణంలో ఎక్కడ చుసిన పందిళ్ళ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ నాగరాణి విజ్ఞప్తి మేరకు పండుగను అందరూ ప్రశాంతమైన వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకునే విధంగా పందిళ్లకు అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరం పట్టణంలో జేపీ రోడ్డు, పద్మాలయ థియేటర్స్ పాత స్పెన్సర్స్ ఎదురుగ భారీ విగ్రహాల అమ్మకం ఏర్పాటు చేసారు. అడుగు ఎత్తు నుంచి 15అడుగుల విగ్రహాలను గణేశ్ ఉత్సవ నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. వాటి ధర 250 నుండి 50వేల రూపాయల వరకు పలుకుతుంది. పలు కూడళ్లలో పాటు భీమవరకు సమీపంలోని ఉండి లోని గణపవరం రోడ్డు లో ఉన్న బొమ్మల తయారీ కేంద్రాల నుండి మరియు పాలకొల్లు సమీపంలోని వర్ధనమ్ గ్రామంలో పెద్ద సైజు అందమైన శ్రీ వినాయక విగ్రహాలు 5వేల రూపాయలు నుండి 30వేల రూపాయలు ధరల వరకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో పాటు మట్టి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. వినాయకులు వాహనాలపై యువత జై జై గణేశా! నినాదాల మధ్య పందిళ్ళకు తరలి వెళుతున్నారు.
