సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 5 ఏళ్ళు షూటింగ్ చేసుకొని ఎట్టకేలకి ఇటీవల విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసిన పాన్ ఇండియా సినిమా వీరమల్లు బాధను పవన్ కళ్యాణ్ అభిమానులు మరచిపోయేలా సెప్టెంబర్ 25 న రిలీజ్ కాబోతున్న ఓజీ ని కచ్చితంగా భారీ హిట్ గా నిలబెట్టడానికి ప్యూహాత్మకంగా నిర్మాతలు పవన్ సహకారంతో అడుగులు వేస్తున్నారు. మంచి స్టయిలిష్ టేకింగ్ తో తయారైన పిరియాడికల్ సినిమాగా ఇప్పటికే సినిమా కు మంచి టాక్ ఉంది. ఇందులో భాగంగానే ఓజీ సినిమాకు నెల ముందే ఓవర్సీస్లో టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి..సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఉత్తర అమెరికాలో ఎంత లేదన్నా 2 మిలియన్ల టికెట్లు అమ్ముడు పోయేలా చేయాలన్నది అసలు ప్లాన్. అభిమానులలో ఓజీ మీద భారీ హైప్ ఉంది. ఇక కొత్త ట్రైలర్ వినాయక చవితి సందడిలో వస్తే అంచనాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. అలాగే వీరమల్లు సినిమా కు ఏ మాత్రం తగ్గని రీతిలో ఓజి సినిమా రిలీజ్ కు 2 వారాల ముందు నుండి సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ ఇప్పటికే డేట్స్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *