సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మరియు పరిసర గ్రామాల ప్రజలకు ప్రతి ఏడాది వరుస పండుగలు వస్తున్నాయంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’.. ఇప్పుడు వినాయకచవితి, దసరా, దీపావళి నేపథ్యంలో ..సామాన్యులు ధనవంతులు అన్న తేడా లేకుండా కుటుంబ సమేతంగా వారికి ఇష్టమైన కాటన్ లేటెస్ట్ వస్త్రాలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేతి వృత్తి కళాకారుల దుస్తులు, తయారుచేసిన వస్తు సామాగ్రి అందుబాటు ధరలలో అందించే ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’2025.. మరోసారి జేపీ రోడ్డులో సరికొత్తగా స్థానిక పద్మాలయ థియేటర్స్ ఎదురుగ గ్రౌండ్ లో ఉచిత ప్రదర్శన, ఉచిత పార్కింగ్ తో సహా అమ్మకాలు ప్రారంభించారు. ఇక్కడ మనకు ఆరోగ్యం ఆహ్లదం కలిగించే కాటన్, చేనేత, కలంకారీ రంగుల వస్త్రాలు, మహిళా శారీస్, ఆధునిక డిజెన్స్, పురుషుల రెడీమేడ్ దుస్తులు, దుప్పట్లు, సోఫా క్లోత్ లు, ఫాన్సీ ,మట్టిపాత్రలు, చెక్క వస్తువులు, ఇంటిని అలంకరించే కళాత్మక అలంకార వస్తువులు, పింగాణిలు, తివాచీలు, వెదురు ఫర్నిచర్, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, వస్త్రాలు దాదాపు 50 స్టాల్స్ పైగా పెద్ద ఎత్తున ఏర్పాటు చెయ్యడం జరిగింది. దేశీయ చేతి కళాకారుల ఉత్పత్తులను వీక్షించడమే కాదు..మన అవసరం మేర కొనుగోలు చేసి చేతి వృత్తి కళాకారుల ఉపాధిని ప్రోత్సహించాలి. తిను బండారాలు, భారీ చాట్ బండార్ లతో పాటు,కుటుంబసమేతంగా ఆస్వాదించవచ్చు..
