సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశవ్యాప్తంగా అన్ని పాఠశాల, ఇంటర్ మీడియట్ విద్యార్థుల ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) విజ్ఞప్తి చేసింది. వయస్సు పెరుగుదలతో ఎదిగే పిల్లల బయోమెట్రిక్స్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు అనుగుణంగా ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయస్సులో, 15-17 సంవత్సరాల వయస్సులోనూ బయోమెట్రిక్స్‌ను అప్డేట్ చేయడం తప్పనిసరి(ఎంబీయూ). ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సర్వీసు పూర్తి ఉచితం. ఆధార్ అప్డేట్ చేయకపోతే నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకు హాజరయ్యే, ప్రభుత్వ పథకాలను అందుకునే విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని యూఐడీఏఐ చైర్మన్ ఉడాయ్ చీఫ్ హెచ్చరించారు.
