సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4నెలలు క్రితం వరకు టమాటా ధర రిటైల్ మార్కెట్ లో 1కేజీ 20 -25 రూపాయలకే అందుబాటులో ఉండేది. అయితే మెల్లగా పెరుగుతూ ప్రస్తుతం క్వాలిటీ బట్టి వినియోగదారులకు 50- 60కి పెరిగిపోయి గత రెండు నెలలుగామార్కెట్లో టమోటా ధరలు నిలకడగానే సాగాయి. కాని నాలుగు రోజులుగా ధరలు ఒక్కసారిగా సగానికి సగం పడిపోయాయి. గత జూన్, జూలై నెలలు, ఆగస్టు 22వ తేది వరకు ఏపీకి కీలకమైన మదనపల్లె మార్కెట్లో క్వాలిటీ టమోటా గరిష్టంగా కిలో రూ.50 పలుకగా, కనిష్టగా కిలో రూ.20 పలికాయి. ఈ ధరలు పలికిన సమయంలో రైతులు మంచి లాభాలు కళ్ల చూసారు. కాని ఇటీవలఅనంతపురం జిల్లాలో టమాటా పంట బాగా పెరగటంతో ఆగస్టు నెల చివరి వారంలో మదనపల్లె మార్కెట్లో టమోటా ధరలు ఒక్కసారిగా పతనం అవుతు న్నాయి. గరిష్ట ధర వరుసగా కిలో రూ. 50 నుంచి రూ.44, రూ.36, రూ.26కు పడిపోయాయి. తాజగా నేడు,శనివారం కిలో రూ.20 నుంచి కిలో రూ.15 వరకు పడిపోయింది. దీని ప్రభావం తో రాష్ట్ర వ్యాప్తంగా టమాటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
