సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ మాజీ సీఎం, BRS పార్టీ అధినేత కెసిఆర్ కుమార్తె తిరుగుబాటు ఫై ఎట్టకేలకు బీఆర్ఎస్ (BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. నేడు, మంగళవారం గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. నిన్న(సోమవారం) అమెరికా నుంచి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కవిత షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై కవిత అధికార కాంగ్రెస్ నేతలకు మద్దతుగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా కేటీఆర్, హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
