సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని పొడిగిస్తున్నట్టు తెలిపారు. వాటిలో కొన్ని ముఖ్య రైళ్ల వివరాలు… 07219 నర్సాపూర్ – తిరువన్నమల్లయ్ (అరుణాచలం) (ప్రతి బుధవారం) అక్టోబర్ 1,8,22, నవంబర్ 5,19,26 తేదీల్లో, 07220 తిరువన్నమల్లయ్ – నర్సపూర్ (ప్రతిగురువారం) అక్టోబర్ 2, 9, 23 నవంబర్ 6, 20, 27 తేదీల్లో,ఈనెల 6 నుంచి నవంబరు 29 వరకు, 07225 చర్లపల్లి – షాలిమర్ (కోల్ కత్తా) ప్రతి సోమవారం 1 నుంచి అక్టోబర్ 13 వరకు, 07226 షాలిమర్ – చర్లపల్లి (ప్రతి మంగళవారం) 2 నుంచి అక్టోబరు 14 వరకు, 08439 పూరి – పాట్నా(ప్రతి శనివారం) ఈ నెల 13నుంచి నవంబర్ 29 వరకు నడపనున్నా రు. 08440 పాట్నా – పూరీ(ప్రతి ఆదివారం( 14 నుంచి నవంబరు 29 వరకు, 02811 భువనేశ్వర్ – యశ్వంత్‌పూర్(ప్రతి శనివారం) ఈ నెల 13 నుంచి నవంబర్ 29 వరకు, 02812 యశ్వంత్ పూర్–భువనేశ్వర్(ప్రతి సోమవారం) సెప్టెంబర్ 15 నుంచి డిసెంబరు 1 వరకూ నడపనున్నారు. 08581 విశాఖపట్టణం – ఎస్‌ఎంవిటి బెంగళూరు (ప్రతి ఆదివారం) ఈ నెల 14 నుంచి నవంబరు 31 వరకు, 08582 ఎస్‌ఎంవీటీ బెంగళూరు – విశాఖపట్నం(ప్రతి సోమవారం) ఈ నెల 15 నుంచి డిసెంబర్ 1వరకు, 08547 విశాఖపట్టణం – తిరుపతి (ప్రతి బుధవారం)అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు, 08548 తిరుపతి – విశా ఖపట్టణం (ప్రతిగురువారం) అక్టోబరు 2 నుంచి నవంబరు 27 వరకు, 08579 విశాఖపట్టణం – చర్లపల్లి (ప్రతి శుక్రవారం) అక్టోబర్ 3 నుంచి నవంబరు 28 వరకు, 08580 చర్లపల్లి – విశాఖ పట్టణం(ప్రతిశనివారం)అక్టోబరు 4నుంచి నవం బరు 29వరకు నడపనున్నారు.
