సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ (Balakrishna), సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో సీనియర్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో ఒక భారీ చిత్రం రానున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. భారత్ అను నేను.. శ్రీమంతుడు వంటి సందేశంతో కూడిన మాస్ చిత్రాల దర్శకుడితో బాలయ్య చేతులు కలపడంతో ఇది అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మరో “లెజెండ్” తరహా సినిమాగా మారింది. ఈ సినిమా అత్యంత కీలకమైన తదుపరి షెడ్యూల్ ఆగస్టు రెండో వారంలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ పూర్తిగా యాక్షన్ ప్రియులకు కనువిందు చేయబోతోందట. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే ఏకంగా 20 రోజుల పాటు చిత్రబృందం నాన్‌స్టాప్‌గా షూటింగ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే మేజర్ హైలైట్‌గా బాలకృష్ణ పాత్ర మాఫియా నేపథ్యంలో అత్యంత పవర్‌ఫుల్‌గా సాగుతుందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతి బరిలో దింపడానికి శరవేగంగా సినిమా సిద్ధం చేస్తున్నారు.
