సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం నాడు భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరగనున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్బీ గంగాధర శాస్త్రి గారి భగవద్గీత ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు.అక్కడి సభ ఏర్పాట్లు కూడా పరిశీలించారు. తదుపరి నేడు, బుధవారం ఆకివీడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ మొదటి సమావేశంలో గౌరవ అధ్యక్షుడి హోదాలో పాల్గొని రైతాంగానికి వ్యవసాయ రంగానికి పంట ఉత్పత్తులకు వాటి మార్కెటింగ్ వంటి పలు అంశాలపై డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో రఘురామకృష్ణ రాజు చర్చించి పలు సూచనలు చేసారు.
