సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు 3నెలలు ముందస్తుగానే రంగం సిద్ధం అవుతుంది. స్థానిక సంస్థలలో ముందుగా 2026 జనవరి నుంచి కార్పొరేషన్/ మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు,ఎన్నికలు నిర్వహించాలని, 2026 జూలై నుంచి ఎంపీటీసీ/జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. గత 2020 ఫిబ్రవరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 907 పంచాయతీలకు 4 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2021 మార్చిలో 876 ఎంపీటీసీలు, 48 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల సెప్టెంబరులో ఎంపీటీసీ/ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఆ తరువాతే ఎంపీపీ, జిల్లా పరిషత్‌లకు పాలక వర్గాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2023 లో జిల్లాల విభజన జరిగింది. అయితే ఏ జిల్లాకు ఆ జిల్లాకు పంచాయతీలు విభజన జరగ్గా, ఎంపీటీసీలు/జడ్పీటీసీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇప్పటికి కొనసాగుతున్నాయి. ఇప్పుడు 2026 జూలైలో ఎంపీటీసీ/ జడ్పీటీసీ ఎన్ని కలు నిర్వహించడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దానితో త్వరలోనే పూర్తీ స్వష్టత వస్తుంది. దశాబ్దం తరువాత ఈసారి అయిన సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరగాలని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణ ప్రజలు కోరుకొంటున్నారు. మరోసారి అన్ని రాజకీయపార్టీల అభ్యర్థుల ఎన్నికల కోలాహలం మొదలు కానుంది.
